చైనా అధ్యక్షుడికి బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి

Chinese President Xi Jinping Is Suffering From Cerebral Aneurysm - Sakshi

Cerebral or intracranial aneurysm: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మెదడుకి సంబంధించిన "సెరిబ్రల్ అనూరిజం"తో బాధపడుతున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ వ్యాధి కారణంగానే గతేడాది 2021 చివరిలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. జిన్‌పింగ్‌ ఎదుర్కొంటున్న సెరెబ్రల్ అనూరిజం అనే వ్యాధి ప్రమాదకరమైనదని వెల్లడించింది. అందువల్లే కరోనా విజృంభించినప్పటి నుంచి బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ వరకు కూడా జిన్‌పింగ్‌ విదేశీ నాయకులను ఎవర్నీ కలవలేదు. దీంతో జిన్‌పింగ్‌ ఆరోగ్యం క్షీణించిందంటూ పుకార్లు వెల్లువెత్తాయి. 

ఏంటీ సెరిబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ అనూరిజం 
సెరిబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ అనూరిజం అనేది మెదడులోని ధమని అసాధారణ ఫోకల్ డైలేషన్. దీని ఫలితంగా రక్తనాళాల గోడ లోపలి కండరాల పొర బలహీనపడుతుంది. దీంతో మెదడులో రక్తం క్లాట్‌ అవుతుంటుంది. అంతేకాదు ఈ రక్తనాళాలు ఎప్పుడూ పగిలిపోతాయో చెప్పలేం. దీంతో మెదడు చుట్టూ రక్తస్రావం అవుతుంది. దీన్ని సబ్‌అరాక్నోయిడ్ హెమరేజ్ (ఎస్‌ఏహెచ్‌) అంటారు. ఈ రక్తస్రావం కారణంగా సదరు వ్యక్తి స్ట్రోక్ లేదా కోమాలోకి వెళ్లిపోవడం లేదా మరణించడం జరుగుతుంది.

ఎప్పుడూ ఈ వ్యాధి బయటపడిందంటే?
మార్చి 2019 లో జిన్‌పింగ్‌ తన ఇటలీ పర్యటనలో ఆయన సరిగా నడవలేకపోయారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌ పర్యటనలో కూడా కూర్చోవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడే ఈ వ్యాధి బయటపడింది. అంతేకాదు 2020లో షెన్‌జెన్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు దగ్గుతో చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో అప్పటి నుంచి జిన్‌పింగ్‌ ఆరోగ్యం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.

(చదవండి: అల్‌ జజీర్‌ మహిళా జర్నలిస్ట్‌ను చంపిన ఇజ్రాయిల్‌ దళాలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top