దూకుడు పెంచిన చైనా.. తైవాన్‌కు యుద్ధ విమానాలు  | China Flies 20 Warplanes Across Taiwan Strait Igniting Tensions | Sakshi
Sakshi News home page

దూకుడు పెంచిన చైనా.. తైవాన్ గగనతలంపై చైనా యుద్ధ విమానాలు..

Published Sun, Sep 17 2023 12:00 PM | Last Updated on Sun, Sep 17 2023 12:33 PM

China Flies 20 Warplanes Across Taiwan Strait Igniting Tensions - Sakshi

తైపే: ద్వీపదేశమైన తైవాన్‌పై చైనా మరోసారి దూకుడు ప్రదర్శించింది. తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 20 యుద్ధ విమానాలు స్వైరవిహారం చేశాయి. ఎదో కుట్రపూరిత ఆలోచనతోనే అవి తైవాన్ జలసంధిలోని మధ్యస్థ రేఖను దాటినట్లు తైపీ అధికారులు తెలిపారు.

కుట్రపూరితమైన ఆలోచనలతోనే.. 
స్వీయ పాలిత దేశం తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చైనాకు తమదేశానికి మధ్యలో ఉండే జలసంధిలో చానాకు చెందిన సుమారు 20 యుద్ధ విమానాలు రెండు దేశాలను వేరుచేసే మధ్యస్థ రేఖను దాటి దేశ ఆగ్నేయ నైరుతి వాయు రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయన్నారు. చైనా దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగానే ఇటువంటి ట్రైనింగ్ మిషన్లను నిర్వహిస్తోందని దానికోసమే పెట్రోలింగ్ విమానాలతోనూ నౌకలతో ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.

వారి జోక్యాన్ని సహించలేక.. 
ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతోనే బీజింగ్ డెమోక్రటిక్ తైవాన్‌ను తన స్వంత భూభాగంగా ప్రకటించుకుంటోందని వారు దీన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు కూడా సాహసిస్తుందని అందులో భాగంగానే సైనికపరమైన, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచిందన్నారు. ఇదే నెలలో అమెరికా, కెనడాకు చెందిన రెండు నౌకలు ఈ నెలలో తైవాన్ జలసంధి వద్ద విహరిస్తూ ద్వీపదేశానికి అండగా నిలిచే ప్రయత్నం చేయడంతో చైనా దళాలు అప్రమత్తమయ్యాయని తైపే రక్షణశాఖ తెలిపింది. 

ఇదేమీ కొత్త కాదు.. 
ఈ వారంలోనే ద్వీపం చుట్టూ విహరిస్తున్న 68 విమానాలను 10 యుద్ధ నౌకలను గుర్తించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో కొన్ని విమానాలు మరియు యుద్ధనౌకలు చైనా షాన్‌డాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ద్వారా కొన్ని యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు  సముద్రంలోనూ గాలిలోనూ శిక్షణ పశ్చిమ పసిఫిక్‌ వైపుగా వెళ్లాయని తెలిపింది తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ. అయితే చైనా ఇంత వరకు ఈ చొరబాటు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్ నెలలో బీజింగ్ ఇటువంటి మిలటరీ విన్యాసాలే చేయగా తైవాన్ అధ్యక్షుడు సై ఇంగ్ వెన్ విషయాన్ని కాలిఫోర్నియా వెళ్లి యూఎస్ హౌస్ సభాపతి కెవిన్ మెక్ కార్తీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తైవాన్ కేవలం 24 గంటల్లో ఏకంగా 71 చైనాకు చెందిన యుద్ధ నౌకలను గుర్తించింది.  

ఇది కూడా చదవండి: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement