భారత్‌-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి? | Bodies of Minor Girl Boy Found Near Indo Pak Border | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి?

Jun 30 2025 11:18 AM | Updated on Jun 30 2025 11:31 AM

Bodies of Minor Girl Boy Found Near Indo Pak Border

జైసల్మేర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ మృతదేహాలు ఒక మైనర్‌ బాలిక, మరో యువకునివిగా పోలీసులు గుర్తించారు.  సంఘటనా స్థలంలో లభ్యమైన పాకిస్తాన్ సిమ్ కార్డ్, ఐడీలు, మొబైల్ ఫోన్, వాటర్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వాకి మరణానికి డీహైడ్రేషన్  కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారు చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించారా లేదా అనేదానిని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. అంతర్జాతీయ సరిహద్దు నుండి భారత భూభాగంలో 12 కిలోమీటర్ల దూరంలోని సాధేవాలా ప్రాంతంలో ఈ మృతదేహాలను  గుర్తించినట్లు జైసల్మేర్ ఎస్పీ సుధీర్ చౌదరి తెలిపారు. మృతులను రవి కుమార్ (17),  శాంతి బాయి (15)గా గుర్తించామన్నారు.

వారి దగ్గర లభ్యమైన ఐడీలు 2023లో జారీ అయ్యాయని ఎస్పీ తెలిపారు. రవి కుమార్‌ పేరుతో పాకిస్తానీ సిమ్ కార్డు,  గుర్తింపు కార్డు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరూ దాదాపు వారం రోజుల క్రితం మరణించినట్లు  పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను రామ్‌గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీకి పోలీసులు తరలించారు. పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత వాకి మృతికి కారణమేమిటనేది వెల్లడి కానున్నదని పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సీసీటీవీ సాక్షిగా భార్యాభర్తల గొడవ, ఆ మర్నాడే..

Advertisement
 
Advertisement
Advertisement