కారులో మకాం వేసిన కొండ చిలువ.. ఎంత భయంకరంగా ఉందో..

Australia: Family Finds Snake Wrapped Around Car Mirror - Sakshi

మెల్‌బోర్న్‌: సాధారణంగా చాలామంది పాముని చూడగానే భయంతో వణికిపోతుంటారు. పాము.. ఉందంటే ఆ దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా ఇష్టపడరు. అయితే.. ఒక్కొసారి  పాములు, కొండ చిలువలు దారితప్పి.. జనవాసాల మధ్యన, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోనికి దారితప్పి వస్తుంటాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలను మనం చూశాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

బ్రిస్బెన్‌ పట్టణంలో ఉండే జోష్‌ కాస్ట్‌లీ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సరదాగా క్విన్స్‌లాండ్‌కు పిక్నిక్‌కు వెళ్లాడు. వారు తమ వాహనాన్ని బుష్‌లాండ్‌ సమీపంలో పార్క్‌ చేసి బయటకు లోపలికి వెళ్లిపోయారు. పిక్నిక్‌లో సరదాగా గడిపిన తర్వాత.. బయటకు వ​చ్చారు. అప్పుడు వారు ఒక షాకింగ్‌ సంఘటనను చూశారు. వారు పార్క్‌ చేసిన కారు అద్దానికి ఒక మీటరు పొడవున్న.. కొండ చిలువ చుట్టుకుని ఉండటాన్ని గమనించారు. దీంతో ఆశ్చర్యపోయారు.

జోష్‌ కాస్ట్‌లీ పాములను పడుతుంటాడు. ఇప్పటికే పాములను పట్టిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు మాత్రం.. జోష్‌ కాస్ట్‌లీ ఎందుకో ఆ కొండ చిలువను పట్టే సాహసం చేయలేదు. అతను.. పీటర్‌ అనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించాడు. పీటర్‌ అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకుని సమీపంలోని అడవిలో విడిచిపెట్టాడు. 

గతంలో ఒక పామును పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కాస్ట్‌లీ.. పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత.. సమయానికి వైద్యం అందండంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.  ఈ కొండ చిలువ చిత్రాన్ని కూడా.. కాస్ట్‌లీ తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉంది..’ ‘ నీ అదృష్టం బాగుంది..’, ‘ కారు అద్దాన్ని భలే చుట్టేసుకుందే..’ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top