
వాషింగ్టన్:డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకో సంచలన నిర్ణయం తీసకుంటున్నారు. ట్రంప్ తన సన్నిహితుడైన బిలియనీర్ ఇలాన్‌మస్క్‌కు అమెరికా ప్రభుత్వ పాలన వ్యవస్థ(డోజ్)ను ప్రకక్షాళన బాధ్యత అప్పగించారు. మస్క్ నేతృత్వంలోని డోజ్ నుంచి కూడా అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సమర్థత పెంపుపై రోజుకు ఒక కొత్త నిర్ణయం వెలువడుతోంది.
ఈ క్రమంలోనే డోజ్‌లో మస్క్ టీమ్‌లో ఎంతమంది పనిచేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మస్క్ టీమ్‌లో 19నుంచి24 ఏళ్ల వయసున్న ఆరుగురు ఇంజినీర్లు ఉన్నారు. వీరికి తోడు కొత్తగా నిఖిల్ రాజ్‌పాల్ అనే 30 ఏళ్ల భారతీయ యువకుడు డోజ్‌లో మస్క్ టీమ్ సభ్యుడిగా చేరారు.
ఇప్పటికే మస్క్ టీమ్‌లో ఉన్న ఆకాష్‌బొబ్బ కూడా భారతీయ యువకుడే కావడం గమనార్హం. అయితే కొత్తగా చేరిన నిఖిల్ రాజ్‌పాల్ కంప్యూటర్ ఇంజినీర్. మస్క్‌కు చెందిన కంపెనీలు టెస్లా,ఎక్స్(ట్విటర్)లో కూడా నిఖిల్ కీలక బాధ్యతల్లో పనిచేశారు.తాజాగా డోజ్‌లో చేరిన నిఖిల్ అమెరికా ప్రభుత్వ పాలన వ్యవస్థ ప్రక్షాళనలోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment