
మిస్సిస్సిప్పి: అమెరికాలోని బాల్టిమోర్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ రెజినాల్డ్ ‘రెగ్గీ’కరోల్(54) మిస్సిస్సిప్పిలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. బర్టన్ లేన్ ప్రాంతంలో బుల్లెట్ గాయాలైన రెగ్గీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాల్పుల ఘటన బుధవారం జరిగినట్లుగా భావిస్తున్నారు. మోనిక్ వంటి వారితో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న కామెడీ క్లబ్బుల్లో ప్రదర్శనలు ఇచ్చిన రెగ్గీ అందరికీ సుపరిచితుడు.