ఆర్మీ హెలికాప్టర్లు ఢీకొని..9 మంది మృతి | 9 killed in Army Black Hawk helicopter crash in Kentucky | Sakshi
Sakshi News home page

ఆర్మీ హెలికాప్టర్లు ఢీకొని..9 మంది మృతి

Mar 31 2023 4:54 AM | Updated on Mar 31 2023 4:54 AM

9 killed in Army Black Hawk helicopter crash in Kentucky - Sakshi

ఫోర్ట్‌కాంప్‌బెల్‌(అమెరికా): కెంటకీలో అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్‌ కాంప్‌బెల్‌కు 30 మైళ్లదూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది.

101 ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌కు చెందిన హెచ్‌హెచ్‌–60 బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లు రెండూ రాత్రి వేళ జరుగుతున్న రోజువారీ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురికావడంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంత అటవి, కొంతమైదానం ఉన్నాయని కెంటకీ గవర్నర్‌ ఆండీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement