రక్తపు మడుగులో బాలుడు.. ఎలుకలే చంపాయా..?

6 Month Old Baby In US Dies From More Than 50 Rat Bites - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆర్నెళ్ల బాలుడు రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. శిశువు మృతదేహం చుట్టూ ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇళ్లంత చెత్తమయంగా ఉందని పేర్కొన్నారు. బాలుని శరీరంపై ఎలుకలు కొరికిన ఘాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎలుకల దాడిలోనే చిన్నారి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

డేవిడ్, ఏంజెల్ స్కోనాబామ్‌లు ఇండియానాలో ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అదే ఇంటిలో బాలుని అత్త, డెలానియా థుర్మాన్‌లు నివాసం ఉంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకునేప్పటికి బాలుడు రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తల, ముఖం మొత్తం ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని వెల్లడించారు. శిశువు వేళ్లు సగం మేర కొరికి ఉన్న ఒళ్లు జలదరించే దృశ్యాలను చూసినట్లు చెప్పారు. 

శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే అప్పటికే మరణించినట్లు పోలీసులు తెలిపారు. తాము వెళ్లే సమయానికి బాధిత ఇళ్లంతా చెత్తతో నిండి ఉందని తెలిపిన పోలీసులు.. ఎక్కడ చూసినా ఎలుకలు సంచరిస్తున్నాయని చెప్పారు. బాధిత శిశువు తండ్రి ఫోన్ చేయగా.. తాము ఆ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధిత శిశువు తల్లిదండ్రులతో పాటు అత్తామామలను కూడా అరెస్టు చేశారు. 

ఎలుకలు పిల్లల్ని కరవడం ఇదే మొదటిసారి కాదని ఇంతకు ముందు కూడా జరిగినట్లు బాధిత కుటుంబానికి చెందిన పిల్లలు చదివే పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. బాధిత కుటుంబానికి చెందిన ఓ పిల్లవాడి కాలును ఎలుక కొరికినప్పుడు తాము ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. బాధిత పిల్లల్ని శిశు సంరక్షణ గృహానికి పంపించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 

ఇదీ చదవండి: Jaahnavi Kandula: జాహ్నవి మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top