ఆడుకుంటూనే మృత్యు ఒడికి..  | 14-Year-Old Gujarat Girl Collapses While Playing, Heart Attack Suspected | Sakshi
Sakshi News home page

ఆడుకుంటూనే మృత్యు ఒడికి.. 

Jun 9 2026 4:52 AM | Updated on Jun 9 2026 5:35 AM

14-Year-Old Gujarat Girl Collapses While Playing, Heart Attack Suspected

గుండెపోటుతో బాలిక మృతి  

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలిక ఆనంది మోదీ పిల్లలతో కలిసి ఆడుకుంటూ కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటు కారణంగా ఆమె మరణించినట్లు చెబుతున్నారు. జామ్‌నగర్‌కు చెందిన ఆనంది సెలవుల సందర్భంగా రాజ్‌కోట్‌లో బంధువుల ఇంటికి వచి్చంది. ఆదివారం సాయంత్రం భోజనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లింది.

 అక్కడ భోజనం తర్వాత రెస్టారెంట్‌ ప్రాంగణంలోనే పిల్లలతో కలిసి ఆడుకోవడం ప్రారంభించింది. పరుగు పందెం ప్రారంభించారు. ఇంతలోనే ఆనంది ఒక్కసారి కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. 2024 డిసెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. 14 ఏళ్ల బాలుడు మోహిత్‌ చౌదరి పాఠశాలలో పరుగు పందెంలో పాల్గొంటూ గుండెపోటుతో మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement