మన వెయ్యి రూపాయలు.. అక్కడ లక్షపైమాటే!

1000 Rupees from India Become lakhs in Vietnam - Sakshi

మనం డాలర్‌తో భారత రూపాయిని పోల్చి చూసినప్పుడు మన కరెన్సీ విలువ చాలా తక్కువనిపిస్తుంది. అయితే కొన్ని దేశాల్లో భారత కరెన్సీకి అత్యధిక విలువ ఉంది. ఆ దేశానికి మనం మన వెయ్యి రూపాయలు తీసుకెళ్తే, అది అక్కడ లక్షలకు సమానమవుతుంది. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇదే వాస్తవం. 

వియత్నాం..  సంస్కృతికి, ప్రకృతి సౌందర్యానికి, ఫుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం వియత్నాంలో ఒక భారతీయ రూపాయి విలువ 291 వియత్నామీస్ డాంగ్. అంటే ఆ దేశానికి  మనం వెయ్యి రూపాయలు తీసుకువెళితే, అది అక్కడ 2,91,000 వియత్నామీస్ డాంగ్ అవుతుంది. వియత్నాం వెళ్లడానికి ఏదోఒక ప్రత్యేక సీజన్ కోసం వేచి చూడాల్సిన పనిలేదు.  ఏ సీజన్‌లోనైనా వియత్నాంను సందర్శించవచ్చు. అయితే చాలా మంది పర్యాటకులు డిసెంబర్-జనవరి మధ్య ఇక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో అక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు.

వియత్నాంలొని హాలాంగ్‌ బే ప్రముఖ పర్యాటక ప్రదేశం. దీనిని ‘బే ఆఫ్ డిస్కవరింగ్ డ్రాగన్స్’ అని కూడా అంటారు.  1994లో యునెస్కో ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చింది. వియత్నాం రాజధాని హనోయి కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. ఈ నగరానికి చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. వియత్నాం ఉత్తర భాగంలో ఉన్న హువా గియాంగ్ కూడా పర్యాటకపరంగా ప్రాచుర్యం పొందింది.
ఇది కూడా చదవండి: యమునలో కరసేవకులకు పిండ ప్రధానం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top