​​​​​​​బస్సు కండక్టర్‌పై మహిళ దాడి | - | Sakshi
Sakshi News home page

​​​​​​​బస్సు కండక్టర్‌పై మహిళ దాడి

Feb 10 2024 5:54 AM | Updated on Feb 10 2024 7:38 AM

- - Sakshi

హైదరాబాద్: తాను దిగాల్సిన చోటబస్సు ఆపలేదని ఆగ్రహించిన ఓ మహిళ కండక్టర్‌పై దాడికి పాల్పడిన సంఘటన అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ పులి యాదగిరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన ప్రసన్న శుక్రవారం శివరాంపల్లిలో బస్సు ఎక్కిన ఆమె హైదర్‌గూడ కల్లు కంపౌండ్‌ ప్రాంతంలో దిగాల్సి ఉండగా అత్తాపూర్‌లో దిగింది.

వెనక్కి వెళ్లేందుకుగాను రోడ్డు దాటి మెహిదీపట్నం నుంచి ఉప్పల్‌ వెళుతున్న 300 నంబర్‌ బస్సు ఎక్కింది. సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న బస్టాపులో దిగేందుకు ప్రయత్నిచగా కండక్టర్‌ ముత్యాల నర్సింహ ఎక్కడ దిగాలమ్మా అని అడిగాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రసన్న మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారో అంటూ ఆయన దవడలు వాయించింది. దీంతో ప్రయాణికులు జోక్యం చేసుకుని బస్సును రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెల్లారు. బస్సు స్టేషన్‌కు చేరుకోగానే ప్రసన్న అందరికళ్లుకప్పి అక్కడినుంచి పరారైంది. కండక్టర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement