యువతకు ఇందులో అవకాశాలున్నాయి! : సెలబ్రిటీ డిజైనర్‌ 'షబ్నమ్‌ గుప్తా' | - | Sakshi
Sakshi News home page

యువతకు ఇందులో అవకాశాలున్నాయి! : సెలబ్రిటీ డిజైనర్‌ 'షబ్నమ్‌ గుప్తా'

Oct 13 2023 4:54 AM | Updated on Oct 13 2023 8:45 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యువతలకు ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో అద్భుతమైన అపారమైన అవకాశాలు ఉన్నాయని, సృజనకు పదును పెట్టుకుంటే విజయాలు సుసాధ్యమని సెలబ్రిటీ డిజైనర్‌ షబ్నమ్‌ గుప్తా అన్నారు. నగరంలోని ఫిలిమ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కోషా ఇంటీరియర్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన పీకాక్‌ లైఫ్‌ బ్రాండ్‌ను నగరానికి పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు.

తన ఇంట్లో వేసిన కలర్స్‌ నచ్చక సొంతంగా రంగులు వేయడం అనే అభిరుచి నుంచి ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్స్‌ పరిణితి చోప్రా, ఇర్ఫాన్‌ ఖాన్‌, కంగనారనౌత్‌ తదితరుల ఇళ్లకు డిజైన్‌ చేసే దాకా సాగిన తన 3 దశాబ్దాల ప్రయాణాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. శతాబ్దాల నాటి ఇంటీరియర్‌ వస్తువులకు కొత్త సొబగులు అద్దుతూ కోషాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలోని ఉత్పత్తుల విశేషాలను సంస్థ సీఈఓ అజితా యోగేష్‌ వివరించారు. కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు పేజ్‌ త్రీ సోషలైట్స్‌, డిజైనింగ్‌ రంగ ప్రముఖులు.. హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement