
హైదరాబాద్: ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి సహాయకురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. బీహెచ్‌ఈఎల్ ఆర్‌సీ పురానికి చెందిన యువకుడు అనారోగ్యంతో సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ మెడికల్ కళాశాల బోధన ఆసుపత్రిలో చేరాడు. అతడికి సహాయంగా అతడి సోదరి(19) అక్కడే ఉంటూ సేవలు అందిస్తోంది.
ఈ నెల 16న రాత్రి భోజనం చేసేందుకు క్యాంటిన్‌కు వచ్చి తిరిగి వార్డుకు వెళుతుండగా క్యాంటీన్‌లో పనిచేసే షాబాబ్ (33) అనే వ్యక్తి ఆమెను వెంబడించి ల్యాబ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు షాబాద్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.