జూన్‌ 22 నుంచి గోల్కొండ బోనాలు | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 22 నుంచి గోల్కొండ బోనాలు

Apr 30 2023 8:58 AM | Updated on Apr 30 2023 8:58 AM

- - Sakshi

హైదరాబాద్: గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు జూన్‌ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 22 గురువారం మొదటి, జూన్‌ 25 ఆదివారం 2వ బోనం, జూన్‌ 29న గురువారం 3వ బోనం ఉంది.

ఆదివారం జూలై 2న 4వ బోనం, జూలై 6న 5వ బోనం, 6వ బోనం జూలై 9న, 13 జూలైన 7వ బోనం ఉంటుంది. అదే విధంగా 8వ బోనం 16 జూలై ఆదివారం, జూలై 20న గురువారం 9వ పూజ ఉంటుందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా గోల్కొండ కోట నుంచే బోనాలు ప్రారంభమవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement