లిబర్టీ: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన వారికి ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంజలి ఘటించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం లిబర్టీ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆరుగురు మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, ఇటీవల స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు యువకులు, నలుగురు యువతులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాకేష్‌సింగ్, రాముగౌడ్, అఫ్సనా, డాక్టర్ హరిచరణ్, సతీష్, హర్ష, రేష్మ, ఫాతిమా, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.


