న్యూస్‌రీల్
మరణించినా.. అందని ప్రయోజనాలు
సాక్షి, వరంగల్: కార్మికుల సంక్షేమం, ఉద్యోగుల భద్రత, వారి భవిష్యత్‌కు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వ సంస్థల్లోనే వారి హక్కులకు భంగం కలిగితే ఎవరికి చెప్పుకోవాలి? కష్టపడి పనిచేసినందుకు వచ్చే వేతనంలో కొంత మొత్తం భవిష్యత్ అవసరాలకు పీఎఫ్ రూపంలో జమ కావాలి. అనారోగ్యం, ప్రమాదం, పదవీ విరమణ, మరణం వంటి సందర్భాల్లో ఆ సొమ్ము కుటుంబాలకు అండగా నిలవాలి. కానీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)లో కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ భరోసా కరువవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. పీఎఫ్, ఈఎస్‌ఐ సమస్యల పరిష్కారానికి నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం కనిపించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
14 నెలల బకాయిలు పెండింగ్!
2019, 2020, 2021 సంవత్సరాలకు సంబంధించి 14 నెలల పీఎఫ్ బకాయిలు తమ ఖాతాల్లో జమ చేయాలని ఏడుగురు ఉద్యోగులు ఇటీవల కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. 2019 జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఐదు నెలలు, 2020 జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలలు, 2021 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నారు.
అధికారుల అండదండలతోనే..
బల్దియాలో 3,700 వరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే వీరికి నెలకు ఒక్కొక్కరికి రూ.1,800కు పైగా పీఎఫ్ జమ కావాల్సి ఉంది. అంటే రూ.66 లక్షలకు పైగా పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ కావాలి. ఇవి సరిగ్గా జరుగుతున్నాయో, లేదోనని ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ఉంది. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ఫైళ్ల పరిష్కారానికి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ప్రైవేట్ వ్యక్తికి కావాలనే ఈ పనులను అప్పగించి, వచ్చినదాంట్లో అధికారులు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కమిషనర్ ప్రత్యేక విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కార్మికులు కోరుతున్నారు.
22న రాష్ట్రస్థాయి సెమినార్
కాళోజీ సెంటర్: హైదరాబాద్‌లో ఈనెల 22న రాష్ట్రస్థాయి గణిత సెమినార్ నిర్వహించనున్నట్లు వరంగల్ డీఈఓ ఎన్.ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ‘రిమైనింగ్ స్కూల్ మేథమెటిక్స్ ఫర్ ఫ్యూచర్–రెడీ లెర్నర్స్’ అంశంపై సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గణిత విద్య, ఏఐ ఆధారిత బోధన, స్టెమ్, కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, వాస్తవ జీవిత సమస్యల పరిష్కారంలో గణితం పాత్ర తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సెమినార్‌లో పాల్గొనేవారు తమ సెమినార్ పేపర్ల సమర్పణకు డిసెంబర్ 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గణిత ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని, అన్ని పాఠశాలల్లో విస్తృత ప్రచారం కల్పించాలని డీఈఓ సూచించారు.
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ చాహత్
వెరసి అకౌంట్స్ విభాగం
పనితీరుపై అనుమానాలు..
ఒకవైపు పాత బకాయిలు.. మరోవైపు కొత్త ఉద్యోగుల ఖాతాల సమస్యలు.. ఇంకోవైపు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాలపై స్పష్టత లేకపోవడం.. వెరసి అకౌంట్స్ విభాగం పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ ప్రైవేట్ వ్యక్తికే ఈ బాధ్యతలు అప్పగించడంతో పీఎఫ్ ఖాతాదారులు హే‘రామ్.. రామ్’ అనాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అకౌంట్స్ విభాగంలో రెగ్యులర్ ఉద్యోగులు, అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ కీలకమైన ఆర్థిక వ్యవహారాలను మరో ప్రైవేట్ వ్యక్తికి ఎందుకు అప్పగించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జీడబ్ల్యూఎంసీలో కార్మికుల ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐ
వ్యవహారాల్లో నిర్లక్ష్యం
3,700 మంది కార్మికులు.. నెలకు రూ.66 లక్షలకు పైగా
జమ కావాల్సిందే..
ఏడుగురు ఉద్యోగులకు 14 నెలల బకాయిలు... కమిషనర్‌కు వినతి
మరణించిన ఉద్యోగుల
కుటుంబాలకూ అందని ప్రయోజనాలు
ఫైళ్లు పరిష్కారం కావాలంటే హే ‘రామ్’ అనాల్సిందేనని ఆరోపణలు
కుటుంబ పెద్దను కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు పాత పీఎఫ్ బకాయిలు, ఖాతాల బదిలీలు, ఇతర అర్హతగల ప్రయోజనాలు అందడంలోనూ జాప్యం జరుగుతోందని బాధితులు చెబుతున్నారు. అనారోగ్యంతో విధులకు దూరమైన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబసభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించిన సందర్భాల్లోనూ పాత ఖాతాల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తున్నారు. కొత్త ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నమోదు, యూఏఎన్ అనుసంధానం కూడా పెండింగ్‌లో ఉంటుందని వాపోతున్నారు.


