విధుల్లో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Nov 20 2026 7:33 AM | Updated on Nov 20 2026 7:33 AM

కాశిబుగ్గ: భద్రతా సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. ఎంజీఎం ఆస్పత్రిని గురువారం ఆమె సందర్శించారు. నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ), అసంక్రమిత వ్యాధుల చికిత్స వార్డు (ఎన్‌సీడీ), వృద్ధుల సంరక్షణ విభాగం, పోషకాహార పునరావాసం కేంద్రం, డైక్‌ను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, రికార్డులు, హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. సంబంధిత వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని విభాగాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని, వార్డులు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన అంకాలజీ, పిడియాట్రిక్‌ వార్డు, డైక్‌ సెంటరకు సంబంధించిన ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఓ వార్డులో బెడ్‌షీట్లను శుభ్రం చేయకపోవడం, బయటి ఆహారాన్ని రోగులు ఎందుకు తింటున్నారని ప్రశ్నిస్తూ సంబంధిత స్టాఫ్‌ నర్సుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించినట్లు తెలిసింది. కలెక్టర్‌ వెంట డీఎంహెచ్‌ఓ బి.రాజారెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ రామ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

11 నుంచి ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2026 ప్రచారాన్ని విస్తృతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. గురువారం వరంగల్‌ కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్‌ ఎల్‌.కిశోర్‌కుమార్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి పాల్గొన్నారు.

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు జారీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement