వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండ చౌరస్తా: దేశ ఐక్యతకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కొనియాడారు. గురువారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండ కాంగ్రెస్ భవన్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, ఏనుమాముల మార్కెట్ చైర్మన్ ప్రియాంక అనిల్, హసన్‌పర్తి పీఏసీఎస్ చైర్మన్ పింగళి వెంకటరాం నరసింహారెడ్డి, అనిల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులున్నారు.


