బస్సుల తరలింపును విరమించుకోండి | - | Sakshi
Sakshi News home page

బస్సుల తరలింపును విరమించుకోండి

Nov 20 2026 7:33 AM | Updated on Nov 20 2026 7:33 AM

బస్సుల తరలింపును విరమించుకోండి

హన్మకొండ : వరంగల్‌–1 డిపోలో అధికారుల వేధింపులు మానుకోవాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, డిపో నుంచి బస్సుల తరలింపును విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రధాన యూనియన్లు (ఆర్టీసీ తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌) జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పాటయ్యాయి. ఈ మేరకు గురువారం హనుమకొండలోని వరంగల్‌–1 డిపోలో ఉదయం 5 గంటలకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం ధర్నా చేశారు. ఈసందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ డిపో నుంచి ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు బస్సులు ఇతర డిపోలకు బదిలీని నిలిపివేయాలని, పంపిన వాటిని తిరిగి డిపోలకు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రాజధాని డే అవుట్‌ సర్వీస్‌లను స్పెషల్‌ ఆఫ్‌ సర్వీస్‌లుగా మార్చాలని, టైర్‌ పంక్చర్‌, చిన్న డ్యామేజ్‌ అయిన క్రమంలో అక్రమ చార్జ్‌ షీట్‌ జారీని విరమించుకోవాలన్నారు. వరంగల్‌–1 డిపోలో జూన్‌–2026లో ఉద్యోగ విరమణ పొందిన వారికి ఒక నెల జీతం ఇప్పటివరకు చెల్లించలేదు. వెంటనే ఆ జీతాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నాలో ఆర్టీసీ వరంగల్‌–1 డిపో ఆర్టీసీ తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి పి.డి.రెడ్డి, ఎంప్లాయీస్‌ యూనియన్‌ సెక్రటరీ ఎం.రాజు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సెక్రటరీ డి.సంపత్‌, ఎన్‌ఎంయూ సెక్రటరీ ఎ.విరాట్‌, జేఏసీ నా యకులు ఉపేంద్రచారి, ఎస్‌.ఆర్‌. కుమార్‌, డి.శ్రీని వాస్‌, అయూబ్‌ పాష్‌, శ్రీనివాస్‌, కార్మికులున్నారు.

వరంగల్‌–1 డిపో సమస్యలపై

ఆర్టీసీ జేఏసీ ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement