రుద్రేశ్వరస్వామికి ఆవుపాలతో రుద్రాభిషేకం | - | Sakshi
Sakshi News home page

రుద్రేశ్వరస్వామికి ఆవుపాలతో రుద్రాభిషేకం

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

హన్మకొండ కల్చరల్‌ : కార్తీక మాసోత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం నగరంలోని రుద్రేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని 51 లీటర్ల ఆవు పాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పార్వతీపురానికి చెందిన ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ విశ్వంభరీమాత.. ఆలయాన్ని సందర్శించి కార్తీకపురాణంలోని కథలను వివరించారు. వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమాదేవి దంపతులు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి దంపతులు తదితర ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీకదీపాలు వెలిగించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు. రాత్రి 8 గంటలకు మహా హారతి శోభాయమానంగా జరిగింది.

వేయిస్తంభాల ఆలయంలో కార్తీక సోమవారం పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement