గళమెత్తిన బాలలోకం | - | Sakshi
Sakshi News home page

గళమెత్తిన బాలలోకం

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

గళమెత్తిన బాలలోకం

హనుమకొండ కలెక్టరేట్‌లో బాలల ప్రజావాణికి వినతుల వెల్లువ

ఈఫొటోలో కలెక్టర్‌తో మాట్లాడుతున్నది కాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు. తమ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, భవనం ఎప్పుడు కూలుతుందో తెలియక భయంతో పాఠాలు వింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా సమకూరిన ఆర్‌ఓ ప్లాంట్‌కు మరమ్మతులు చేయించాలని డీఈఓకు సూచించారు.

● పాఠశాలల్లో సమస్యలు విన్నవించిన విద్యార్థులు

● సమస్యలు పరిష్కరిస్తానని కలెక్టర్‌ హామీ

● అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టరేట్‌లో మహిళా, శిశు, పిల్లల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం బాలల గ్రీవెన్‌న్స్‌ సెల్‌ నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ హాజరై వివిధ పాఠశాలల విద్యార్థుల నుంచి వినతులు స్వీకరించారు. బాలల ప్రజావాణికి మొత్తం 51 వినతులు అందాయి. పాఠశాల భవనాల మరమ్మతులు, అల్పాహారం సమస్యలు, పాఠశాలల సమీపంలోన్‌షాపులు, మద్యం దుకాణాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, పాఠశాల సమయాలు, ఉపాధ్యాయుల కొరత తదితర సమస్యలను విద్యార్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement