నేడు వరంగల్‌ ఆర్‌ఓ ఉద్యోగుల సామూహిక సెలవు | - | Sakshi
Sakshi News home page

నేడు వరంగల్‌ ఆర్‌ఓ ఉద్యోగుల సామూహిక సెలవు

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

నేడు వరంగల్‌ ఆర్‌ఓ ఉద్యోగుల సామూహిక సెలవు ప్రమాద బాధితుల వైద్యఖర్చులకు ‘పీఎం రాహత్‌’ చెల్లింపులు వరంగల్‌ ఆర్‌ఓపై ఇంటెలిజెన్స్‌ ఆరా రేపటి నుంచి టీటీడీ మనగుడి కార్తీక మాసోత్సవాలు కళతోనే సంస్కృతి బతుకుతుంది

కాజీపేట అర్బన్‌: సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ పునరుద్ధరణకు మంగళవారం సామూహిక సాధారణ సెలవు తీసుకోనున్నట్లు వరంగల్‌ ఆర్‌ఓ ఉద్యోగులు తెలిపారు. వరంగల్‌ ఆర్‌ఓ కార్యాలయంలోని రిజిస్ట్రేషన్‌తో పాటు చిట్స్‌ ఉద్యోగులు సెలవు దరఖాస్తును సోమవారం జిల్లా రిజిస్ట్రార్‌కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా, మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే శాంతియుత సత్యాగ్రహ దీక్షలో పెన్‌డౌన్‌తో పాల్గొంటామని, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని తెలిపారు.

సీపీఎస్‌ ఉద్యోగులు..

కాళోజీ సెంటర్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ సీపీఎస్‌ ఈయూ జిల్లా ఆధ్వర్యంలో నేడు (మంగళవారం) సామూహిక సాధారణ సెలవుకు పిలుపునిచ్చినట్లు జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి రవీందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10:30 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న ధర్నాలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

హన్మకొండ అర్బన్‌ : పీఎం రాహత్‌ పథకం కింద ఇద్దరు రోడ్డు ప్రమాద బాధితుల ఆస్పత్రి బిల్లుల చెల్లింపులకు హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సోమవారం ఆమోదం తెలిపారు. పథకం కింద వైద్య ఖర్చుల చెల్లింపుల మంజూరు నిమిత్తం ఎన్‌ఐసీ ఈ–డీఏఆర్‌ జిల్లా మేనేజర్‌ శివకుమార్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య, సీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ చల్ల ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌ : వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంపై ఇంటెలిజెన్స్‌ పోలీసులు సోమవారం ఆరా తీసినట్లు సమాచారం. ఉద్యోగుల వివరాలు, కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఉద్యోగుల విధులు తదితర అంశాలపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ విషయం కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది.

హన్మకొండ కల్చరల్‌: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ నెల 18 నుంచి మనగుడి కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కార్యక్రమ బాధ్యుడు రామిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. ఈమేరకు సోమవారం వరంగల్‌ రామన్నపేటలోని ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలో కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీటీడీ ధర్మప్రచార మండలి సభ్యులు గట్టు మహేశ్‌బాబు, తిరునగరి నరేందర్‌ తదితరులు సంబంధిత ప్రచార బ్యానర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. వరంగల్‌లో శ్రీశృంగేరి శంకర మఠం, హనుమకొండలో హంటర్‌ రోడ్డులోని శ్రీచంద్రమౌళీశ్వర సహిత అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 18 బుధవారం నుంచి నవంబర్‌ 24 వరకు కార్తీక మాస విశిష్టతపై సప్తాహ ప్రవచనాలు జరుగుతాయని తెలిపారు. 24న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సహస్ర దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మంత్రి ధనసరి అనసూయ

విద్యారణ్యపురి: కళ జీవిస్తేనే సంస్కృతి బతుకుతుందని, సమాజ చైతన్యమే లక్ష్యంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సమాజకవి డాక్టర్‌ వల్లంపట్ల నాగేశ్వర్‌రావు అని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఆదివారం రాత్రి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో వల్లంపట్ల నాగేశ్వర్‌రావు సప్తతి ముగింపు ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత ‘తలకొరివి’ అనే నాటికను కళాకారులు ప్రదర్శించారు. అనంతరం నాగేశ్వర్‌రావు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు అకాడమీ చైర్మన్‌ ఆచార్య కె.వెంకటనారాయణ, తేరాల యుగేంధర్‌, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, రాజిరెడ్డి, రాజమౌళి, ప్రొఫెసర్‌ కృష్ణమాచారి, బిల్లా మహేందర్‌, నాగబెల్లి జితేందర్‌, నక్క కుమారస్వామి, గాయకులు లక్ష్మణాచారి, నల్లనూరి రమేశ్‌, చిలువేరు శ్రీనివాస్‌, మ్యాకల సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement