నేడు వెలుగుల పండుగ | - | Sakshi
Sakshi News home page

నేడు వెలుగుల పండుగ

Nov 8 2026 1:19 AM | Updated on Nov 8 2026 1:19 AM

నేడు వెలుగుల పండుగ

హన్మకొండ కల్చరల్‌: జ్ఞానజ్యోతి వెలిగించి కొత్త ఆశలను మోసుకొచ్చే ఆధ్యాత్మిక దీపావళి పర్వదినం నేడు.. దీపకాంతి జ్ఞానానికి ప్రతీక, అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోనికి పయనించి జీవితపరమార్థాన్ని తెలియజేసే దివ్వెల దీపావళి పండుగ ఉద్దేశం.. ఇంట్లోని ప్రతి కూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులను తీకువచ్చే గొప్ప పండుగ ... ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు నేడు ఆదివారం నగర ప్రజలు దీపావళిని జరుపుకోనున్నారు.

బంతిపూలు, తోరణాలతో

వ్యాపార కేంద్రాల అలంకరణ

వ్యాపారులు ప్రతిఒక్కరూ ఈ రోజున వ్యాపారకేంద్రాన్ని శుభ్రంచేసి తోరణాలు కట్టి, బంతిపూలతో అలంకరించుకుంటారు. అష్టైశ్వర్యాలు ప్రసాదించే శ్రీమహాలక్ష్మీదేవికి భక్తిపూర్వకంగా పూజలు జరుపుకుంటారు. తమ జమాఖర్చుల లెక్కల పుస్తకాలను పూజిస్తారు. కొత్తగా జమఖర్చు పుస్తకాలను రాయడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు పండుగ వచ్చిందంటే వరంగల్‌చౌరస్తా, హన్మకొండ చౌరస్తాలో వ్యాపారులు లక్ష్మీపూజలు నిర్వహించుకున్న అనంతరం రాత్రి 8 గంటల నుంచి బాణసంచాకాల్చేవారు.

కిక్కిరిసిపోయిన రహదారులు..

మట్టిప్రమిదలు, పింగాణి ప్రమిదలు, వివిధ అంతస్తుల ప్రమిదలు విక్రయాలతో, బాణసంచావిక్రయాలతో శనివారం నగరంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్బంగా హన్మకొండలోని హంటర్‌రోడ్డు, వరంగల్‌చౌరస్తా, బట్టల బజార్‌ ప్రాంతాలలో వెలసిన బాణసంచా దుకాణాలలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో పాటు కేదారేశ్వరవ్రతంలో ఉపయోగించే పట్టుదారాలు, మర్రిఊడలు, కొత్తచేటలు, ఊదు, బంతిపూలు, లక్ష్మీదేవిగా ప్రియమైన పద్మములు తదితర నోము సామగ్రి అమ్మకాలు జోరుగా జరిగాయి.

అమ్మవారిని పూజించాలి..

దీపావళి రోజు దీపతోరణాలు వెలిగించే ఆచారం ఉంది కాబట్టి దీపావళి పండుగగా పిలుస్తారు. ఈరోజున శ్రీమహా లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇంటింటికి తిరుగుతుందని భావిస్తారు కావున ప్రజలు శ్రీమహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. మట్టి ప్రమిదలో నెయ్యి లేదా నూనె పోసి, వత్తులు వేసి దీపాలు వెలిగించడం సర్వశ్రేష్టం. దీపాల వరుసను వృక్షాకారంలో, స్వస్తిక్‌ ఆకారంలోనూ పేర్చి వెలిగిస్తే మంచిది.

– ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి, శ్రీగోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రం నిర్వాహకులు,

నారసింహ ఉపాసకులు, గోపాల్‌పూర్‌

వృక్షాకారంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది..

వ్యాపారులకు

శ్రీమహాలక్ష్మీ పూజలు ప్రత్యేకం..

కిక్కిరిసిపోయిన నగర రహదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement