ఖిలా వరంగల్: ఖిలా వరంగల్‌లోని రాతికోట సమీపంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇన్నర్, ఔటర్ మోటు అభివృద్ధి పనులను శుక్రవారం కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతిపాదిత ఇన్నర్ మోటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పనుల ప్రారంభం స్థానం నుంచి ముగింపు వరకు చేపట్టాల్సిన నిర్మాణాలపై అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమె అధికారులతో సమీక్షించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా ఆవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈపర్యటనలో కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, ఏఈ భరత్, స్థానికులు బిల్లా శ్రీకాంత్, బైరబోయిన శివాజీ పాల్గొన్నారు.


