పరిశోధనాత్మక దృక్పథం అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పరిశోధనాత్మక దృక్పథం అలవర్చుకోవాలి

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

విద్యారణ్యపురి: విద్యార్థులు శాసీ్త్రయ పరిశోధనాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌.శ్రీనివాస స్వామి అన్నారు. హనుమకొండ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ను శుక్రవారం బాలసముద్రంలోని శ్రీనివాస్‌ గురుకుల్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా సుస్థిరత కోసం జ్ఞానం అనే ప్రధాన ఇతివృత్తంలోని ఐదు ఉప అంశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌, గురుకులాల నుంచి 200 మంది విద్యార్థులు 100 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ప్రాజెక్టులను అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఆర్‌.వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్‌ ఎం.నరేందర్‌, డాక్టర్‌ డి.వీరన్న, డాక్టర్‌ సుతారి సతీశ్‌ మూల్యంకనం చేశారు. 70 మంది గైడ్‌ టీచర్లు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన ప్రాజెక్టులకు జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాసస్వామి బహుమతులు ప్రదానం చేశారు. కాగా, జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులు ఈనెల చివరి వారంలో రాష్ట్రస్థాయిలో పాల్గొననున్నారు. కార్యక్రమంలో బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా అకాడమీ కో–ఆర్డినేటర్‌ దొంతుల శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ గురుకుల్‌ ప్రిన్సిపాల్‌ యుగేంధర్‌ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయికి ఎంపికై న ప్రాజెక్టులివే..

జూనియర్‌ విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు

● స్మార్ట్‌ పుడ్‌ పరిశోధన: ఎం.సహస్రిక, కొలను కీర్తన, ధర్మసాగర్‌ మండలం నారాయణగిరి జెడ్పీహెచ్‌ఎస్‌

● రూఫ్‌టాప్‌ రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌, ఎ.వేదశ్రీ, తేజస్వి ఉన్నత పాఠశాల

సీనియర్‌ విభాగంలో..

● దోమల రహిత గ్రామం: బి.హరీష్‌, నడికుడ జెడ్పీహెచ్‌ఎస్‌

● ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ విత్‌ ఎనర్జీ రీ జనరేషన్‌: ఎం.దీక్షిత్‌, వేలేరు పీఎం శ్రీ గురుకుల పాఠశాల

● పేపర్‌వేస్ట్‌ రీసైక్లింగ్‌ అండ్‌ రీయూజ్‌: ఆర్‌.ఆసిత, ఎల్కతుర్తి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల

హనుమకొండ జిల్లా సైన్స్‌ అఽధికారి శ్రీనివాసస్వామి

ఘనంగా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

రాష్ట్రస్థాయికి ఐదు ప్రాజెక్టుల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement