హన్మకొండ అర్బన్: ‘వైద్యాధికారి సంతకం ఫోర్జరీ’ శీర్షికన గురువారం ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఫోర్జరీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే అంశాలపై కమిటీ విచారణ జరుపుతుందని, సంబంధిత రికార్డులను పరిశీలించి నివేదిక అందిస్తుందన్నారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామన్నారు. విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డాక్టర్ అప్పయ్య తెలిపారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో మోసాఫ్ట్ (ఎంఓహెచ్) టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో గురువారం పరస్పర ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, మోసాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు సుభా చాగంటి ఒప్పంద పత్రాలు మార్చుకుని మాట్లాడారు. నిట్ వరంగల్ ఎంహెచ్ సాఫ్ట్ టెక్‌తో కమర్షియల్ ఎంఓయూను నిట్ వరంగల్‌లోని ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఆవిష్కరించిన స్వదేశీ ఓజోన్ ఆధారిత క్రిమి సంహారక సాంకేతికతను అందజేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్‌లో ఎంఓయూ కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని ఎంఓహెచ్ సాఫ్ట్‌టెక్ సీఈఓ సుభా చాగంటి తెలిపారు. కాగా, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం సాంకేతికత ఆధారిత ఉత్పత్తులను తయారు చేసేందుకు ఎంఓయూ తోడ్పడుతుందని ఎంఓహెచ్ సాఫ్ట్ టెక్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడు, నిట్ పూర్వ విద్యార్థి శ్యామ్ మామిడి తెలిపారు. కార్యక్రమంలో నిట్ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్లు డి.హరనాథ్, ఆర్.రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: యువతలోని కళా నైపుణ్యాల్ని వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయని జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ అన్నారు. గురువారం హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవం బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందించారు. కవితా రచనలో జి.ఆకాంక్ష ప్రథమ, ఎన్.వైష్ణవి (కేయూ) ద్వితీయ బహుమతి సాధించారు. చిత్రలేఖనంలో పి.శ్రీనిక ప్రథమ, డి.వాహిని ద్వితీయ స్థానంలో నిలిచారు. నుక్కడ్ నాటక్‌లో కౌశల్ బృందం విజేతగా నిలిచింది. జానపద గీతాల పోటీలో ఎస్‌కే.ఖైరాన్ ప్రథమ, కావేరి ద్వితీయ బహుమతి పొందారు. జానపద బృంద నృత్యంలో సిరి పౌర్ణమి బృందం ప్రథమ, పరశురామ్ బృందం ద్వితీయ స్థానాలు సాధించాయి. జాతీయ యువజన అవార్డు గ్రహీతలు మండల పరశురాములు, ఆకులపెల్లి మధు, మౌనిక, నయీమ్ తదితరులున్నారు.
దివ్యాంగ విద్యార్థులను గుర్తించాలి: డీఈఓ
విద్యారణ్యపురి: జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులను గుర్తించడం కోసం స్క్రీనింగ్ పరీక్షను ప్రతీ పాఠశాలలో రాబోయే పది రోజుల్లో పూర్తి చేయాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ.గిరిరాజ్‌గౌడ్ కోరారు. గురువారం హనుమకొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లాలోని సమ్మిళిత విద్య రిసోర్స్‌పర్సన్ల, స్పెషల్ ఎడ్యుకేటర్లకు నిర్వహించిన ఒక రోజు శిఽక్షణలో డీఈఓ ఎల్వీ.గిరిరాజ్‌గౌడ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా గుర్తించినవారికి అవసరమైన పరికరాలు అందించే బాధ్యత కూడా ఉందన్నారు. సమావేశంలో జిల్లా సమ్మిళిత విద్య కో–ఆర్డినేటర్ బి.మహేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థికి 64 ప్రశ్నలు పూర్తి చేసి మొదటి దశ స్క్రీనింగ్ పూర్తి చేయాలని కోరారు. రెండో దశను స్పెషల్ ఎడ్యుకేటర్లు పాఠశాలకు హాజరై పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్‌మోహన్, రిసోర్స్‌పర్సన్ శ్రీధర్ సుమన్ తదితరు లు పాల్గొన్నారు.


