సెల్లారా? సెలయేరా? | - | Sakshi
Sakshi News home page

సెల్లారా? సెలయేరా?

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

సెల్లారా? సెలయేరా?

● వారానికిపైగా భవనం అడుగు భాగాన నిలిచి ఉన్న నీరు..

● రద్దీ ఉండే ఏరియాలో ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత?

ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనం హనుమకొండ చౌరస్తాలోనిది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ కాంప్లెక్స్‌లోని సెల్లార్‌ మొత్తం వరద నీటితో నిండింది. వర్షం కురిసి వారం దాటినా సెల్లార్‌లోని నీటిని మాత్రం తొలగించలేదు. నీటి నిల్వ కారణంగా పిల్లర్లు, గోడలు దెబ్బతిని భవనం నేలమట్టం అయ్యే ప్రమాదం ఉంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే అవకాశం ఉంది. ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. ఈబహుళ అంతస్తుల భవనంలో వివిధ వ్యాపార సముదాయాలున్నాయి. నిత్యం వందలాది మంది కస్టమర్లు ఆయా షాపులకు వస్తూ పోతుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, హనుమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement