నేడు జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

నేడు జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

విద్యారణ్యపురి: విద్యార్థుల్లో పరిశోధన, సృజనాత్మక ఆలోచనలకు జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ఒక వేదికగా నిలుస్తోంది. భారత ప్రభుత్వశాస్త్ర సాంకేతిక శాఖ, జాతీయ శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రదర్శనలు రెండేళ్ల తర్వాత నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ హనుమకొండ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌ గురుకుల్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల నేడు (శుక్రవారం) నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌, జిల్లా సైన్స్‌ కాంగ్రెస్‌ కో–ఆర్డినేటర్‌ ఎస్‌.శ్రీనివాసస్వామి వెల్ల డించారు.

ప్రాజెక్టులు సిద్ధం..

ఈజాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రాజెక్టుల కోసం 2026లో ‘సుస్థిరత కోసం విజ్ఞానం’ అనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా ఐదు ఉప ఇతివృత్తాల్లో బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రతిభ చాటేందుకు విద్యార్థులు సంసిద్ధులయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్‌ అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు ఆరో తరగతి నుంచి పదో తరగతి చడువుతున్న విద్యార్థులు ఈ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రాజెక్టులు ప్రదర్శించబోతున్నారు.

200 మంది విద్యార్థులు..

100 ప్రాజెక్టులు

రెండేళ్ల తర్వాత నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement