జ్వరం, డెంగీ కలకలం | - | Sakshi
Sakshi News home page

జ్వరం, డెంగీ కలకలం

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

జ్వరం, డెంగీ కలకలం

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో జ్వరాలు, డెంగీ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. వాతావరణ మార్పులు, దోమలతో వరంగల్‌ నగరంలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది. ఈ ఏడాది 10 నెలల్లోనే 6,580 జ్వర కేసులు, 164 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన కేసులే ఇంత భారీగా ఉంటే.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

జ్వరమొస్తే జేబుకు చిల్ల్లే..

ప్లేట్‌లెట్ల పేరుతో భయం..

జ్వరం తగ్గకపోతే డెంగీ, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల అనుమానంతో రక్తపరీక్షలు చేయిస్తున్నారు. వైద్యుల కన్సల్టేషన్‌ ఫీజు, రక్త పరీక్షలు, మందులు, స్కానింగ్‌, బెడ్‌ చార్జీలు కలిపితే సాధారణ జ్వరానికే రూ.వేలు ఖర్చవుతున్నాయి. ఇక డెంగీ బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం సహజం. ప్రతి డెంగీ బాధితుడికి ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరముండదు. అయినప్పటికీ ప్లేట్‌లెట్లు తగ్గుతున్నాయంటూ కొంతమంది బాధితులను, వారి కుటుంబ సభ్యులను భయపెట్టి ఆస్పత్రిలో చేర్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

వైద్యారోగ్యశాఖ పర్యవేక్షించాలి..

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోగుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు, పరీక్షల చార్జీలు, బెడ్‌ అద్దెలు, ఐసీయూ ఖర్చులపై వైద్యారోగ్యశాఖ నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా తనిఖీలు తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్‌ బి.రాజారెడ్డిని వివరణ కోరగా తమకు రోగుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే ఆయా ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఖిలావరంగల్‌లో ఉంటున్న ఒకరికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది తొలు త రక్త పరీక్షలు, అనంతరం మరికొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల కన్సల్టేషన్‌, పరీక్షలు, మందులు కలిపి రెండు మూడు రోజుల్లోనే రూ.20 వేల వరకు ఖర్చయ్యాయి.

వరంగల్‌ నగరానికి చెందిన ఒకరు డెంగీ లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లారు. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తప్పనిసరిగా ప్లేట్‌లెట్లు ఎక్కించాలా? చికిత్సకు ఎన్ని డబ్బులవుతాయి అనే విషయాలపై వైద్యులు ముందుగా చెప్పకపోవడంతో చికిత్స అనంతరం వైద్య ఖర్చులు చెల్లించేందుకు ఇబ్బంది పడ్డారు.

వరంగల్‌ జిల్లాలో 10 నెలల్లో

6,580 ఫీవర్‌, 164 డెంగీ కేసులు

రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

రూ.వేలల్లో వసూలు చేస్తున్న

ప్రైవేట్‌ హాస్పిటల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement