నేడు నరకాసుర వధ | - | Sakshi
Sakshi News home page

నేడు నరకాసుర వధ

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

నేడు నరకాసుర వధ

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో నేడు (శుక్రవారం) జరిగే నరకాసుర వధకు సర్వం సిద్ధమైంది. ఏటా దీపావళి పర్వదినానికి ముందు జరిపే ఈ కార్యక్రమానికి నగరవాసులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. బల్దియా, ఇతరశాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమి టీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆధ్వర్యంలో గత 24 ఏళ్లుగా నరకాసురవధ కార్యక్రమం జరుగుతోంది.

ఊరేగింపుతో శ్రీకృష్ణ, సత్యభామ రాక

కరీమాబాద్‌ ఉర్సు ప్రతాప్‌నగర్‌ నుంచి శ్రీకృష్ణ సత్యభామ ఉత్సవ మూర్తులు, పిల్లల వేషధారణతో భారీ ఊరేగింపుతో రంగలీల మైదానానికి చేరుకుంటారు అక్కడే శ్రీకృష్ణ, సత్యభామ డిజిటల్‌ బొమ్మలను ఏర్పాటు చేసి బాణాలతో నరకాసుర ప్రతిమను బాణసంచాతో కాలుస్తారు. గత ఏడాది 56 అడుగుల నరకాసుర ప్రతిమను ఏర్పాటు చేయగా.. ఈఏడాది 58 అడుగుల ప్రతిమను సిద్ధం చేశారు. సాయంత్రంనుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సీపీ శ్వేత ఆదేశాల మేరకు డీసీపీలు అంకిత్‌కుమార్‌, ధార కవిత, అడిషనల్‌ డీసీపీ రాయల ప్రభాకర్‌ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘వీఐపీ, వీవీఐపీలకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశాం. కిలోమీటర్‌ దూరం నుంచి వేడుకలను వీక్షించేలా ఎత్తయిన ప్రదేశంలో నరకాసుర ప్రతిమను ఏర్పాటు చేశాం.’ అని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్లి రవి తెలిపారు.

శాంతియుతంగా జరుపుకోవాలి..

ఉర్సుగుట్ట మైదానంలో నిర్వహించే నరకాసుర ప్రతిమ దహనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా జరిగేలా పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. వేదిక, నాలుగు వైపుల పార్కింగ్‌ స్థలాలు, ట్రాఫిక్‌ మళ్లింపునకు చర్యలు చేపడుతున్నాం.

– శ్వేత, పోలీస్‌ కమిషనర్‌, వరంగల్‌

ముస్తాబైన వరంగల్‌

రంగలీల మైదానం

58 అడుగుల

నరకాసుర ప్రతిమ ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement