పోలింగ్‌ కేంద్రాల పెంపునకు ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల పెంపునకు ప్రతిపాదనలు

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లాలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెంపునకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్‌, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై ఎన్నికల నమోదు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులు, వాటి పరిశీలన తదితర అంశాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఇప్పటివరకు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కోసం 61,041 దరఖాస్తులు వచ్చాయన్నారు. సమావేశంలో హనుమకొండ, పరకాల ఎన్నికల నమోదు అధికారులు, ఆర్డీఓలు వెంకటేశ్‌, డీఎస్‌. వెంకన్న, హనుమకొండ సహాయ ఎన్నికల నమోదు అధికారి, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌సింగ్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు రావు అమరేందర్‌రెడ్డి, ఎండీ నేహాల్‌, ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైల్వే సీసీఎస్‌ షేర్‌ హోల్డర్స్‌కు దీపావళి కానుక..

● 18 శాతం డివిడెంట్‌ చెల్లింపు

కాజీపేట రూరల్‌ : దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ (ఈసీసీఎస్‌–ఎల్‌టీడీ) షేర్‌హోల్డర్లకు 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18 శాతం డివిడెంట్‌ చెల్లించామని కాజీపేట సీసీఎస్‌ డైరెక్టర్‌ డి.శ్రీనివాస్‌యాదవ్‌ గురువారం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సీసీఎస్‌ బోర్డు సభ్యుల సమక్షంలో సీసీఎస్‌ సొసైటీ అధ్యక్షుడు చిలుకు స్వామి ఈ డివిడెంట్‌ నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మేరకు కాజీపేట సీసీఎస్‌ కార్యాలయం కేంద్రంగా కాజీపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ, కాజీపేట –జనగామ వరకు రైల్వే సీసీఎస్‌ సభ్యులైన సుమారు 6,700 మంది షేర్‌హోల్డర్లకు దీపావళి కానుకగా 18 శాతం డివిడెంట్‌ చెల్లించామని, ఈ డివిడెంట్‌ రైల్వే సీసీఎస్‌ మెంబర్ల ఖాతాలో నేరుగా జమ అవుతుందని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement