కేయూలో వరంగల్‌ జోన్‌ క్రికెట్‌ పోటీలు షురూ | - | Sakshi
Sakshi News home page

కేయూలో వరంగల్‌ జోన్‌ క్రికెట్‌ పోటీలు షురూ

Nov 5 2026 12:40 AM | Updated on Nov 5 2026 12:40 AM

కేయూలో వరంగల్‌ జోన్‌ క్రికెట్‌ పోటీలు షురూ సీకేఎంలో ఎంబీఏ అతిథి అధ్యాపకులకు ఆహ్వానం ఎంజీఎంలో స్టెమీ, పాలియేటివ్‌ కేర్‌ సేవలు పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ ఎన్నిక

కేయూ క్యాంపస్‌: కేయూలోని స్పోర్ట్స్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ జోన్‌ పురుషుల క్రికెట్‌ టోర్నమెంట్‌ను వీసీ ప్రతాప్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈక్రికెట్‌ టోర్నమెంట్‌లో పది కళాశాలల జట్లు పాల్గొంటున్నాయి. ఈనెల 6వ తేదీ వరకు టోర్నమెంట్‌ కొనసాగనుందని కేయూ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ డాక్టర్‌ శాస్త్రి తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు త్వరలో జరగబోయే కేయూ అంతర్‌ కళాశాలల క్రికెట్‌ పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడా పోటీల ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఎస్‌.కుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు మట్టెడ కుమారస్వామి, అఫ్షల్‌ అస్లాం, డాక్టర్‌ ఏటీబీటీ ప్రసాద్‌, కేయూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భాస్కర్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఫ్యాకల్టీ సభ్యులు లాల్‌పాషా, సుమన్‌, అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కాశిబుగ్గ: వరంగల్‌ దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరంలో ఎంబీఏ బోధించేందుకు అతిథి అధ్యాపకులు కావాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పోచయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏలో 55 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) మార్కులతో ఉత్తీర్ణత కలిగిన ఉండాలని, పీహెచ్‌డీ/నెట్‌/సెట్‌ కలిగిన వారికి ప్రాధాన్యం, బోధన అనుభవానికి వెయిటేజీ ఇస్తామని పేర్కొన్నారు. అసక్తిగల వారు బయోడేటాతోపాటు జిరాక్స్‌ సర్టిఫికెట్లను కళాశాల కార్యాలయంలో ఈ నెల 7వరకు అందజేయాలని కోరారు.

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎంలో స్టెమీ కార్యక్రమంతోపాటు పాలియేటివ్‌ కేర్‌ సేవల నమోదుపై చర్చించారు. బుధవారం వరంగల్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.రాజారెడ్డి, ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌కుమార్‌రెడ్డి, కాకతీయ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ కార్యక్రమాల సమ్వనయంపై సమీక్షించారు.

హన్మకొండ: ఆల్‌ తెలంగాణ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూపురాణి సీతారాం తెలిపారు. బుధవారం ఆయన కమిటీని ప్రకటించారు. గౌరవ సలహాదారుడిగా సముద్రాల రామనరసింహాచార్యులు, గౌరవాధ్యక్షుడిగా తిరువరంగం నంద కిశోర్‌, అధ్యక్షుడిగా జన్నపురెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, ఆర్థిక కార్యదర్శిగా దేవరకొండ నరేందర్‌, ఉప ప్రధాన కార్యదర్శిగా మురహరి శెట్టి చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షులుగా రెబెల్లి వెంకటేశ్వరస్వామి, బండ నర్సింహా రెడ్డి, బోయినిపల్లి సోమేశ్వర్‌ రావు, బి.వెంకటస్వామి, చెక్క మొగిళి, కోడెపాక శాయన్న, ఎంబాడి శ్యాంసుందర్‌, వన్నాల రాజముల్లు, కాసం సుధాకర్‌ రెడ్డి, కాసం ప్రభాకర్‌, సీహెచ్‌.విద్యాసాగర్‌ ఎన్నికయ్యారు. అదేవిధంగా కార్యదర్శులుగా కందికొండ సదానందం, తాడూరు సుధాకర్‌, డింగరి వేణుగోపాల్‌ చారి, కొదిరిపాక సాంబమూర్తి, మెచం వెంకన్న, తమటం మనోహర స్వామి, మందల వెంకట్‌ రెడ్డి, కోల నర్సయ్య, మహిళా కార్యదర్శులుగా రాజనాల కుసుమ కుమారి, మందల వసుమతి రెడ్డి, గోరంటల అరుణ, కొప్పుల శైలజ, పద్మ ఎన్నికై నట్లు వివరించారు.

మాజీ వీసీ కొకాటేకు నివాళి

కేయూ క్యాంపస్‌ : కేయూ మాజీ వీసీ చంద్రకాంత్‌ కొకాటే మృతికి సంతాపంగా బుధవారం మధ్యాహ్నం పరిపాలనా భవనంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కొకాటే వీసీగా అందించిన సేవలను కొనియాడారు. ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ రాజేందర్‌ సంతాప తీర్మానం చదివారు. ఓఎస్‌డీ వెంకట్రామ్‌రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, పాలకమండలి సభ్యులు చిర్ర రాజు, రమ, కళాశాలల పిన్సిపాల్స్‌, మల్లికార్జున్‌రెడ్డి, వెంకయ్య, టి.శాస్త్రి, కెమిస్ట్రీ విభాగం అధిపతి ఆచార్య వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement