కుడా కీలక ప్రాజెక్టులకు
వరంగల్ అర్బన్ : కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) పరిధిలో రూ. 4,200 కోట్లకు సంబంధించిన నిధుల ప్రతిపాదనలపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అర్బన్ చాలెంజ్ ఫండ్(యూసీఎఫ్)లో భాగంగా ‘కుడా’, గ్రేటర్ వరంగల్ నివేదించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన యంత్రాంగం నిధులకు సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో స్ట్రాంగ్ వాటర్ డ్రెయినేజీ సిస్టానికి రూ.1,240 కోట్లు, ఖిలా వరంగల్ మట్టి, రాతికోట చుట్టూ ఉన్న మోటు పనులకు రూ.210 కోట్లు, కందకం పనుల కోసం రూ.52.27 కోట్లు, హనుమకొండ సీబీడీ పనులకు రూ.42.19 కోట్లు, తదితర ప్రాజెక్టులకు నిధుల మంజూరుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. గోదావరి తాగునీటి పనులకు రూ.398.40 కోట్లుగా పేర్కొన్నారు. వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు గతంలో రూ.120 కోట్ల కాగా, ప్రస్తుత ప్రతిపాదనల మేరకు రూ. 250కోట్ల నిధుల మంజూరుకు పచ్చ జెండా ఊపినట్లు వెల్లడించారు. ‘కుడా’ పరిధిలోని వేయిస్తంభాల దేవాలయం తదితర అభివృద్ధి పనులకుసైతం ఓకే చెప్పినట్లు తెలిపారు. ఈ సొమ్ములో ప్రపంచ బ్యాంక్‌నుంచి 50 శాతం రుణంగా, కేంద్ర ప్రభుత్వం 25 శాతం, స్థానిక సంస్థలు 25 శాతం నిధులు వెచ్చించించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీపీఆర్‌లపై ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం


