హన్మకొండ చౌరస్తా: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లాభ్భాయ్ పటేల్ జయంతిను పురస్కరించుకుని శనివారం హనుమకొండలోని డీసీసీ భవన్లో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ సమగ్రత, సమైక్యత, ఐక్యత కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఇద్దరు మహనీయులను ఒకే రోజు స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి, వరంగల్ ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ పాల్గొన్నారు.


