కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో టెక్నోజియాన్–26 శనివారం ముగిసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ‘బైబై టెక్నోజియాన్ మళ్లీ కలుద్దాం.. నిట్ వరంగల్’ అంటూ వీడ్కోలు పలుకుతూ తమ కళాశాలలకు బయల్దేరారు. రెండు రోజుల పాటు 50కి పైగా ఈవెంట్స్‌తో అబ్బురపర్చిన టెక్నోజియాన్–26లో స్మాష్‌కార్ట్స్, ఇంపాక్ట్ ట్యాంక్, మెకాట్రానిక్స్ గాలా, వెహికిల్ డెమాన్‌స్ట్రేషన్, రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కేబీసీ, వర్టెక్స్ హ్యాకథాన్, ఈకో–సిటీ, రూబ్‌వార్స్‌ల ప్రదర్శనలతో ఆకట్టుకుంది. విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని పరస్పరం పంచుకుని స్టార్టప్ ఐడియాలతో హద్దులు దాటి ఆవిష్కరణలకు నాంది పలికేందుకు వేదికగా టెక్నోజియాన్–26 నిలిచింది. అదేవిధంగా రెండో రోజు సైతం ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిట్ల నిర్వాహణలో శ్రమించిన విద్యార్థులు వీడ్కోలు సందర్భంగా నిట్ ఆడిటోరియంలో డీజే నైట్‌లో సంతోషంగా చిందులు వేశారు.
అట్టహాసంగా ముగిసిన
సాంకేతిక మహోత్సవం
ఆకట్టుకున్న ఎగ్జిబిట్ల ప్రదర్శన
ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు


