ఆహార భద్రతపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఆహార భద్రతపై అవగాహన ఉండాలి

Nov 1 2026 1:02 AM | Updated on Nov 1 2026 1:02 AM

ఆహార భద్రతపై అవగాహన ఉండాలి

తెలంగాణ లోకాయుక్త చైర్మన్‌ జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి

హన్మకొండ: ఆహార భద్రతాప్రమాణాల చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలంగాణ లోకాయుక్త చైర్మన్‌ జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో మహీధర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006, దీని అమలులో రైతు ఉత్పత్తిదారుల సంఘాల పాత్ర అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో లోకాయుక్త చైర్మన్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 ప్రకారం ప్రత్యేక న్యాయస్థానాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సురక్షిత ఆహారం పొందడం ప్రతీ పౌరుడి హక్కు అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఆహార పదార్థాల కల్తీపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ మాజీ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, వరంగల్‌ జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి సీహెచ్‌.కృష్ణమూర్తి, కో ఆపరేటివ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ బి.సంజీవరెడ్డి, శ్రీ వ్యాస ఆశ్రమం అధ్యక్షురాలు కాసర్ల వసుంధర, మహీదర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ డైరెక్టర్‌ పి.పంకజ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement