నేరాల నిరోధానికి వరంగల్‌ కమిషనరేట్‌ వినూత్న కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

నేరాల నిరోధానికి వరంగల్‌ కమిషనరేట్‌ వినూత్న కార్యక్రమం

Nov 1 2026 1:02 AM | Updated on Nov 1 2026 1:02 AM

నేరాల నిరోధానికి వరంగల్‌ కమిషనరేట్‌ వినూత్న కార్యక్రమం సీసీ కెమెరాల ఏర్పాటు

ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సంస్థలు, కాలనీలు, ముఖ్యమైన ప్రదేశాల్లో అవసరమైన చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భద్రతను పెంపొందించుకోవచ్చు. ఇవి నేరాల నివారణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడానికి, నేరాలు జరిగినప్పుడు కీలక ఆధారాలను సేకరించడానికి, నేరగాళ్లను గుర్తించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసి, వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచిస్తారు.

మత్తు పదార్థాల దుష్ప్రభావాలు

గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక స్థితి, విద్య, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచిస్తారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ, వాటి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరుతారు.గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాల సమాచారం తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement