తూకంలో మోసాలు | - | Sakshi
Sakshi News home page

తూకంలో మోసాలు

Nov 1 2026 1:02 AM | Updated on Nov 1 2026 1:02 AM

● నగరంలో అధికారుల దాడులు

● 10 మంది వ్యాపారులపై కేసు

కాశిబుగ్గ: బియ్యం, కిరాణా వ్యాపారులు తక్కువ తూకం వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఎల్‌నినోతో బియ్యం ధరలు భగ్గుమంటాయని ప్రచారం జరగడంతో కొందరు వ్యాపారులు ఇప్పటి నుంచే దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా శనివారం నగరంలో తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడుల్లో తక్కువ కొలతలతో ఉన్న బియ్యం బస్తాలను గుర్తించారు.

బస్తాకు కిలో తక్కువగా..

వరంగల్‌లోని పలు బియ్యం దుకాణాలు, కిరాణం, జనరల్‌ స్టోర్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బస్తాలను తూకం వేయగా, 26 కిలోలు ఉన్న బియ్యం బస్తాలో 25 కిలోలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అలాగే, ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పది కేసులు నమోదు చేశారు. వరంగల్‌ జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి మనోహర్‌ మాట్లాడుతూ వినియోగదారులకు సరుకులను నిర్ణీత తూకం కంటే తక్కువ విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement