హన్మకొండ అర్బన్: ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ఆయన జూమ్ సమావేశం ద్వారా సమీక్షించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బందితో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కార్యక్రమాల అమలుపై సమీక్షించి సూచనలు చేశారు. అన్ని కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ రికార్డులు, ఆన్‌న్‌లైన్ నమోదును సక్రమంగా నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ మురళి, డాక్టర్ రజిత, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, మాస్ మీడియా అధికారి ప్రసాద్, సూపర్‌వైజర్లు పద్మజ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సంవత్సరం కాలపరిమితితో ఆలయంలో భక్తులు సమర్పించిన కొబ్బరి ముక్కలు పోగుచేసుకునే లైసెన్స్ కోసం టెండర్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టెండర్ నిబంధనల ప్రకారం దరావత్ సొమ్మును బ్యాంకు డీడీ ద్వారా కానీ, నగదు రూపంలో కానీ రూ.50 వేలు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. ఆసక్తి ఉన్నవారు టెండర్ సమర్పించాలని కోరారు.
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి పూజిత
● పోక్సో చట్టంపై అవగాహన
హసన్‌పర్తి: విద్యార్థుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హైమ పూజిత అన్నారు. బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో–2012 చట్టంపై హసన్‌పర్తి జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, జ్యోతిరావు పూలే, బాలికల గురుకుల విద్యాలయంలో గురువారం అవగాన కార్యక్రమం నిర్వహించారు. ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’ అఖిల భారత పాఠశాలల ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి హైమ పూజిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలలపై లైంగిక వేధింపులను అరికట్టడంలో పోక్సో చట్టం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బాలలపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేందర్, ఎహెచ్‌టీయూ ఏఎస్సై భాగ్యలక్ష్మి, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ ఎం.రాజ్యలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ సునీత, చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధి రమేశ్, ప్రధానోపాధ్యాయురాలు సుమాదేవి తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. వరి కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి, ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, సహకార శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. డీసీఎస్‌ఓ మహేందర్, జిల్లా సహకార అధికారి మోహన్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజేంద్రప్రసాద్, పౌర సరఫరాల శాఖ డి ప్యూటీ తహసీల్దార్ నాగేంద్రప్రసాద్ ఉన్నారు.


