టెక్నోజియాన్‌–26కు వేళాయె | - | Sakshi
Sakshi News home page

టెక్నోజియాన్‌–26కు వేళాయె

Oct 30 2026 7:24 AM | Updated on Oct 30 2026 7:24 AM

టెక్నోజియాన్‌–26కు వేళాయె

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26ను ఈనెల 30, 31(శుక్ర, శనివారాల్లో)వ తేదీల్లో రెండు రోజులు నిర్వహించనున్నారు. విద్యార్థులే నిర్వాహకులుగా 2006లో ప్రారంభించిన సాంకేతిక మహోత్సవం అనతి కాలంలోనే దక్షిణ భారతదేశ అతిపెద్ద టెక్‌ఫెస్ట్‌గా పేరుగాంచింది. దేశవ్యాప్త ఇంజనీరింగ్‌ కళాశాలల నుంచి సుమారు ఏడు వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌, ఐడియాలను, సాంకేతిక విజ్ఞానాన్ని పరస్పరం పంచుకునే వేదికగా టెక్నోజియాన్‌ నిలవనుంది.

నేడు లాంఛనంగా ప్రారంభం

నిట్‌ వరంగల్‌లోని అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు నిట్‌ టెక్నోజియాన్‌–26ను లాంఛనంగా ఓలెక్ట్రా వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కమల్‌ కిషోర్‌ వోరా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఇందులో నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ, డీన్లు కె.కిరణ్‌కుమార్‌, వెంకన్న, విద్యార్థులు పాల్గొననున్నారు.

టెక్నోజియాన్‌ నిర్వహిస్తారిలా..

నిట్‌ వరంగల్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నోజియాన్‌–26లో 50కిపైగా ఈవెంట్స్‌, రోబోటిక్‌ కాంపిటీషన్‌, స్టార్టప్‌ చాలెంజ్‌, సైబర్‌ సెక్యూరిటీ హ్యకథాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తొలి రోజు శుక్రవారం జహాజ్‌, రూబ్‌ వార్స్‌, మ్యూజికల్‌ కార్నర్‌, కేబీసీ, ఏఐ యూన్వీబ్లెడ్‌, బ్లాకవుట్‌, వెహికల్‌ డెమాన్‌స్ట్రేషన్‌, మెక్‌ట్రానిక్స్‌ గాలా, ప్రాజెక్ట్‌ గరంగట్టు, నేచురల్‌ డిజాస్టార్లను ప్రదర్శించనున్నారు.

రెండో రోజు..

టెక్నోజియాన్‌–26 రెండో రోజు శనివారం డ్రోన్‌ ఏ వార్స్‌, 60 సెకండ్స్‌, ష్యాడో, హోవర్‌ క్రాఫ్ట్‌, రోబోకానాడో, మోడల్‌ మానియా, రోడ్‌ సేఫ్టీ ఫోరమ్‌, ఇంజనీరింగ్‌ చాలెంజ్‌ పోటీలు నిర్వహించనున్నారు.

ప్రత్యేక ఆకర్షణ..

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ క్లబ్‌ రూపొందించిన ఎస్‌డీసీ గేమ్స్‌, రోబోటిక్స్‌ క్లబ్‌ రూపొందించిన ఆర్కేడ్‌, స్మాష్‌కార్ట్స్‌, సీఎస్‌ఈ సొసైటీ రూపొందించిన ఏఐ అన్‌వీల్డ్‌లు నిలవనున్నాయి.

నిట్‌లో నేటి నుంచి టెక్‌ ఫెస్ట్‌

దక్షిణ భారతదేశంలో

అతి పెద్ద సాంకేతిక మహోత్సవం

ప్రారంభించనున్న ఓలెక్ట్రా వైస్‌ ప్రెసిడెంట్‌

కమల్‌ కిషార్‌ వోరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement