పరికరమా.. పరిహాసమా? | - | Sakshi
Sakshi News home page

పరికరమా.. పరిహాసమా?

Oct 30 2026 7:24 AM | Updated on Oct 30 2026 7:24 AM

పరికరమా.. పరిహాసమా?

కాశిబుగ్గ: కాకతీయ మెడికల్‌ కళాశాల ఆవరణలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య సేవలకు సంబంధించిన పరికరాలు ఉపయోగంలో లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి పరికరాలు పనిచేయక పేషెంట్లు ఎంజీఎం ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. అక్కడే అప్పటికే ఎంజీఎం పేషంట్ల క్యూతో పాటు సూపర్‌ పేషంట్లు నిరీక్షించక తప్పట్లేదు.

ఆర్నెళ్లుగా పనిచేయని సీటీ స్కాన్‌

సూపర్‌ స్పెషాలిటీ సేవలందించే ఆస్పత్రిలో ఆరునెలలకు పైగా సీటీ స్కాన్‌ పరికరం మూలకు చేరింది. ఈపరికరానికి మరమ్మతు చేయిస్తామని ఉన్నతాధికారులు పలుమార్లు చెప్పుకొస్తున్నప్పటికీ అమలు కావట్లేదు. దీంతో పేషంట్లు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంజీఎంలో స్కాన్‌ చేయించుకోవడానికి వెళ్తే ఈ పరికరంపై భారం పడుతుందని అక్కడి సిబ్బంది చెబుతుండడంతో పేషంట్లు ఒక్కోసారి ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు.

గదికి తాళం..

ఇక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈఈజీ పరికరం(మూర్ఛ వ్యాధిని గుర్తించే పరీక్షలు చేసే పరికరం) మూడు నెలల నుంచి పనిచేయట్లేదు. దీంతో ఈఈజీ గదికి తాళం వేశారు. ఈ పరీక్షల కోసం కూడా ఎంజీఎంకు వెళ్లాలంటే పేషంట్లు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ముఖ్యంగా స్పృహ కోల్పోవడానికి కారణాన్ని తెలుసుకునే ఈ పరికరం లేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు, అటెండెంట్లు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఇప్పటికై నా ఈ పరికరాలకు మరమ్మతులు చేయించి తమను ఆదుకోవాలని పేషంట్లు కోరుతున్నారు.

కేఎంసీలో ఆరునెలలుగా

పనిచేయని సీటీ స్కాన్‌ యంత్రం

మూడునెలలుగా మూలన పడిన ఈఈజీ మెషిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement