న్యూశాయంపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్‌సేఫ్టీ కమిటీ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 బ్లాక్‌స్పాట్స్ గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు గల కారణాలు క్షేత్రస్థాయిలో విశ్లేషించి, నివారణకు సమగ్ర యాక్షన్‌ప్లాన్ రూపొందించి నివేదికలు సమర్పించాలని అధికారులకు సూచించారు. ఎంజీఎం నుంచి వెంకట్రామా జంక్షన్ వరకు దెబ్బతిన్న రోడ్డును పునఃరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్‌కుమార్, వైవీ గణేశ్, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఎన్‌హెచ్ పీడీ భరద్వాజ్, అధికారులు పాల్గొన్నారు.
నరకాసుర వధకు పకడ్బందీ ఏర్పాట్లు
నరకాసుర వధ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. నవంబర్ 6న వరంగల్ ఉర్సు రంగలీలా మైదానంలో నిర్వహించనున్న నరకాసుర వధ కార్యక్రమ నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు కలెక్టర్(లోకల్‌బాడీస్) వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సుమ, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, డీఎంహెచ్ఓ రాజారెడ్డి, నరకాసుర వధ ఉత్సవ కమిటీ సభ్యుడు ఎం.రవి పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడాలి
యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు పాఠశాల నుంచే విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. గురువారం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
బ్లాక్ స్పాట్స్‌పై యాక్షన్‌ప్లాన్
రూపొందించాలి..
రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో
వరంగల్ కలెక్టర్ సత్యశారద


