వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
హన్మకొండ అర్బన్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.. శ్వేత అన్నారు. విద్యార్థులను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడంతోపాటు బడి బయట ఉన్న పిల్లలను తిరిగి బడిలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణపై బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. నయీ కిరణ్, విద్యాప్రేరణ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం పెంచాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాల ద్వారా బాలల సంరక్షణ, పునరావాసానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనలో అనుమానాస్పద మార్పులను గుర్తించి, అవసరమైనప్పుడు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బడి మానేసిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణపై నిర్వహించే సమావేశాలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల సంఘాల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యేలా సమాచారం అందించాలని సూచించారు. సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నవీన్‌కుమార్, డీఆర్వో శ్రీనివాస్, డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేశ్, డీఎస్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌ను కూకటి వేళ్లతో పెకిలించాలి
హసన్‌పర్తి: డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడంతోపాటు వీటి నెట్‌వర్క్‌లను గుర్తించి సమూలంగా నిర్మూలించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. హనుమకొండలోని వాగ్దేవి కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్ల క్రైం బృందాలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. తమ సమాచార సేకరణ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్‌కుమార్, దార కవిత, ఏసీపీ సదయ్య, పోలీస్ ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు, డ్రగ్స్ సిబ్బంది పాల్గొన్నారు.


