వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు
వరంగల్ అర్బన్: నగరాభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు మున్సిపల్ బాండ్లు కీలకమని వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు పూనమ్ అహ్లువాలియా, సుజాత, వృద్ధిమాన్ తెలిపారు. బుధవారం వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బల్దియా క్యాంపు కార్యాలయం నుంచి కమిషనర్ టి.వెంకన్న, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ మున్సిపల్ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. కమిషనర్ టి.వెంకన్న మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం మున్సిపల్ బాండ్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ జనార్దన్, అకౌంట్స్ ఆఫీసర్ శివలింగం, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ప్రతిభ, సీడీఎంఏ నుంచి రవళి పాల్గొన్నారు.


