భూకొలతల్లో కచ్చితత్వానికి ఆధునిక రోవర్స్‌ | - | Sakshi
Sakshi News home page

భూకొలతల్లో కచ్చితత్వానికి ఆధునిక రోవర్స్‌

Oct 29 2026 1:12 AM | Updated on Oct 29 2026 1:12 AM

భూకొలతల్లో కచ్చితత్వానికి ఆధునిక రోవర్స్‌

న్యూశాయంపేట: భూ రీసర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు భూముల కొలతల్లో కచ్చితత్వాన్ని పెంచేందుకు ఆధునిక రోవర్స్‌ పరికరాలు ఉపయోగపడుతాయని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. రూ.11.42 లక్షల విలువ గల రెండు రోవర్స్‌ పరికరాలను బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ చేతులమీదుగా సర్వే బృందాలకు అందజేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి రీసర్వే ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎల్‌.కిశోర్‌కుమార్‌, సహాయ సంచాలకుడు సర్వే అండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాసులు, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement