22 సర్వీసులకు అదనంగా మరో 10.. సీట్ల కోసం ముందస్తు బుకింగ్
దీపావళి
రద్దీకి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: దీపావళి పండుగ నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) మరోసారి ఊరటనిచ్చింది. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరో ఐదు రోజులు పొడిగించింది. దీంతో రైలు నంబర్ 07711, 07712 ప్రత్యేక రైళ్లు నవంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు కూడా నడవనున్నాయి. ఇప్పటికే అక్టోబర్ 26 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులను పొడిగించిన విషయం తెలిసిందే. దీపావళి తర్వాత సొంతూళ్ల నుంచి హైదరాబాద్ వైపు తిరుగు ప్రయాణం చేసే వారి రద్దీ కూడా భారీగా ఉండే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పండుగకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణికులకు అదనపు రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.
రోజూ రెండు వైపులా రాకపోకలు..
రైళ్ల వేళలు ఇలా..
07711 సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రత్యేక రైలు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 :10 గంటలకు సి కింద్రాబాద్లో బయలుదేరి సాయంత్రం 5: 30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుతుంది. 07712 సి ర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ ప్రత్యేక రైలు సా యంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. కాగా, ఈ రైళ్లు కాజీపేట, జనగామలో ఆగనుండగా, ఉమ్మడి వరంగల్ ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. జనగామ, కాజీపేట, చర్లపల్లి, భు వనగిరి, యాదాద్రి, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రో డ్ స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ఆగుతా యని రైల్వేశాఖ బుధవారం కూడా ప్రకటించింది.
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు 07711, 07712 రైళ్లు 11 చొప్పున మొత్తం 22 సర్వీసులు నడుస్తున్నాయి. తాజాగా నవంబర్ 6 నుంచి 10 వరకు మరో ఐదు రోజుల పాటు పొడిగించడంతో ఇరువైపులా కలిపి మరో 10 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అంటే ఈ విడతలో మొత్తం 32 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. దీపావళి తర్వాత కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగనున్న నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు.. ముఖ్యంగా జనగామ, కాజీపేట మీదుగా హైదరాబాద్ వెళ్లే ఉమ్మడి వరంగల్ ప్రయాణికులకు నిజంగానే ఊరటనిచ్చే నిర్ణయంగా మారింది. కాగా, ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ చైర్‌కార్, రిజర్వ్డ్ సెకండ్ సిట్టింగ్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం మంచిదని దక్షిణ మధ్య రైల్వే కాజీపేట ఏరియా రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
నవంబర్ 10 వరకు
నడవనున్న ప్రత్యేక రైళ్లు..
రద్దీ దృష్ట్యా నిర్ణయం తీసుకున్న
దక్షిణ మధ్య రైల్వే
07711/12 సర్వీసులకు అదనంగా మరో 10 ట్రిప్పులు
ఉమ్మడి వరంగల్ ప్రయాణికులకు మరో ఐదు రోజులు ఊరట
జనగామ, కాజీపేటల్లో స్టాపేజీలు..
పండుగ తర్వాత హైదరాబాద్
తిరుగు ప్రయాణికులకు ప్రయోజనం, భారీ ఊరట
నేడు, రేపు కాకినాడ,
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
కాజీపేట రూరల్ : అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్‌తో కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఈ నెల 29 సాయినగర్–కాకినాడ పోర్టు (17205), 30న సంబర్‌పూర్–హెచ్.ఎస్.నాందేడ్ (20809) ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు మరికొన్ని రైళ్లను కూడా రద్దు, దారి మళ్లించి, రీషెడ్యూల్ చేసి నడిపిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు రైళ్ల సమాచారం కోసం ఎప్పటికప్పుడు 139 నంబర్‌కు డయల్ చేయడం గాని లేదా కాజీపేట జంక్షన్లో గల హెల్డెస్క్లో సంప్రదించాలని వారు కోరారు.


