ఇద్దరు గ్యాస్ట్రో వైద్యులకు షోకాజ్‌లు జారీ? | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు గ్యాస్ట్రో వైద్యులకు షోకాజ్‌లు జారీ?

Oct 29 2026 1:12 AM | Updated on Oct 29 2026 1:12 AM

పీఎం స్వనిధి మహోత్సవానికి సన్నాహాలు

కాశిబుగ్గ: వరంగల్‌ కేఎంసీలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి గ్యాస్ట్రో విభాగంలో పనిచేసే ఇద్ద రు వైద్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన ‘వైద్యం.. చోద్యం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఎంజీఎం ఉన్నతా ధికారులు స్పందించారు. కేఎంసీ సూపర్‌లో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్టు గ్యాస్ట్రో వైద్యుల విధుల తీరు గురించి ఆరా తీసినట్లు సమాచారం. సదరు వైద్యులు తమ కు కేటాయించిన సోమవారం, బుధవారం ఓపీ విభాగాలకు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తించారు. తాజాగా బుధవారం కూడా సూపర్‌లో గ్యాస్ట్రో వైద్య సేవల కోసం పేషెంట్లు వచ్చినప్పటికీ సదరు వైద్యులు హాజరు కాలేదని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ వైద్యుల గురించి డీఎంఈతో పాటు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సూపర్‌ స్పెషాలిటీ సేవలో భాగమైన గ్యాస్ట్రో విభా గంలో ఇలాగా ఉంటే పేషెంట్లకు ఎలా న్యాయం జరుగుతుందని చర్చించినట్లు తెలుస్తోంది. ముందుగా వారిద్దరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుంటున్నట్లు సమాచారం. తదుపరి డీఎంఈ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.

జాతీయ స్థాయి రాకెట్‌ పోటీల్లో వరంగల్‌కు ప్రాతినిధ్యం

హన్మకొండ అర్బన్‌: అంతరిక్ష పరిశోధన రంగంలో వరంగల్‌ విద్యార్థులు మరో ముందడుగు వేస్తున్నారు. జాతీయస్థాయి రాకెట్‌ పోటీల్లో తొలిసారిగా వరంగల్‌కు చెందిన విద్యార్థుల బృందం ‘రుద్రమ వీ2’ రాకెట్‌తో బరిలోకి దిగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌లో నవంబర్‌ 1న జరగనున్న పోటీల్లో నిట్‌ వరంగల్‌కు చెందిన విద్యార్థులు రాకెట్‌ను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్‌లో బుధవారం నమూనా పరీక్షను కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ల్యాప్‌టాప్‌లో పరిశీలించారు. సాంకేతిక సహకారం అందిస్తున్న ఏటీడీఆర్‌ఎల్‌ వ్యవస్థాపకుడు శశాంక్‌ భూపతి, నిట్‌ వరంగల్‌ విద్యార్థుల బృందాన్ని అభినందించారు.

వరంగల్‌ అర్బన్‌: పీఎం స్వనిధి మహోత్సవానికి మెప్మా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నవంబర్‌ 1 నుంచి 15లోగా ఏదో ఒక రోజులో నిర్వహించేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బల్దియా కమిషనర్‌ టి.వెంకన్నను బుధవారం మెప్మా అధికారులు, సిబ్బంది కలిసి వివరాలు వెల్లడించారు. దేశ వ్యా ప్తంగా 76 నగరాలను ఎంపిక చేయగా, అందులో రాష్ట్రం నుంచి హైదరాబాద్‌, వరంగల్‌కు చోటు ల భించింది. స్వనిధి సే సమృద్ధి రాష్ట్రాలకు విడుదల య్యే నిధులు వినియోగించుకోనున్నారు. వీధి వ్యాపారులకు ప్రోత్సాహం ఇచ్చి సన్మానించాలని పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా 48,426 మంది వీధి వ్యాపారులు ఉండగా.. వీరిలో 33,774 మంది గత ఐదేళ్లలో రూ.10వేల నుంచి రూ.50 వేల వరకు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. 426 మందికి క్రెడిట్‌కార్డులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement