వెంకటాపురం(ఎం) : ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రాక రామప్ప దేవాలయం ఆవరణలో నిర్వహిస్తున్న వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపు రెండో రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా కాకతీయుల భూ–ఇంజనీరింగ్, నిర్మాణ సాంకేతికతపై కాకతీయ హెరి టేజ్ సభ్యుడు ప్రొఫెసర్ పాండు రంగారావు వలంటీర్లకు వివరించారు. కాకతీయుల సాంస్కృతిక భూభాగం, కట్ట డాల నిర్మాణం, శిల్పకళ విశేషాలను ప్రొఫెసర్ జీ ఎస్‌వీ సూర్యనారాయణ మూర్తి వివరించారు. క్యాంపులో భాగంగా టూరిజం హైదరాబాద్ కోఆర్డినేటర్ మధు ఒట్టేరి వలంటీర్లతో వారసత్వ పరిరక్షణపై వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యునెస్కో గుర్తింపు పొందిన రుద్రేశ్వర (రామప్ప) ఆలయాన్ని వలంటీర్లు సందర్శించారు. ఆలయ చరిత్ర, నిర్మాణ విశిష్టతను ప్రొఫెసర్ పాండు రంగారావు, టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ వివరించారు.


