హసన్‌పర్తి: అమ్మవారిపేట శివారులోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ భస్మీకరణ ప్లాంట్‌లో సుమారు రూ.4.83 కోట్ల విలువైన గంజాయిని శనివారం దహనం చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లల్లో నమోదైన 106 కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న 967.864 కిలోల గంజాయిని నిబంధనల మేరకు కాల్చివేశారు. ఈసందర్భంగా ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నిరంతరం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గంజాయితోపాటు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ ని ర్మాణమే లక్ష్యంగా పోలీస్‌శాఖ పనిచేస్తోందని పే ర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీ డేవిడ్‌రాజు, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


