లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలో ఉత్తీర్ణలైన అభ్యర్థులు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చే ముందు రెండున్నర గంటల నిడివిగల 6 వీడియోలను తప్పని సరిగా వీక్షించాలి. అభ్యర్థి ముఖ గుర్తింపు ఆధారంగా వీడియో కొనసాగుతుంది. అవసరమైతే మధ్యలో విరామం తీసుకోవచ్చు. వీడియో మొత్తం పూర్తి చేస్తేనే శాశ్వత లైసెన్స్ కోసం రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) పొందాలి.
– సురేశ్‌రెడ్డి, డీటీసీ హనుమకొండ, వరంగల్


